I read this in a newspaper.....It was really Heart touching.....hmmm......no Heart breaking....Thats y wanted to share with u guys......

వేధింపు ఎలా ఉంటుందో ఆ బాధను అనుభవించే అమ్మాయే చెపాలి. చెప్తుంది. అయిన అర్ధం చేసుకోలేం. ఇదొక విషాదం. అమ్మాయిని వేధించేవాడు దీక్షగా ఆ పని చేస్తుంటాడు.జీవిత ధ్యేయంగా చేస్తుంటాడు. వాడికి అదొక్కటే పని. ప్రపంచానికి చాల పనులుంటాయి. ఆ పనుల్లో పడి అది తన ప్రపంచంలో ఉండిపోతుంది. పక్కనే కుర్చుని, వాడు తన ముందున్న అమ్మాయి జడ లాగుతున్న ప్రపంచానికి గమనింపు ఉండదు. వాడికి ధైర్యం వస్తుంది. ప్రపంచానికి కూడా ఒక జడ ఉండి ఉంటే సరదాగా దాన్ని కూడా కాసేపు లాగి ఎదిపించవచు కదా అని ఉత్సాహపదతాడు. ఆ ఉత్సాహం వాడి మెదడులోంచి కాళ్ళలోకి చేరి మోకాళ్ళు ఉగుతుంటాయి. అమ్మాయికి తగలడం కోసమే ఉగుతుంటాయి. ప్రతిచోటా వాడు ఆ అమ్మాయికి అడ్డు తగులుతుంటాడు. ఏ పని చేసుకోనివ్వాడు. ఏదో ఒక భయం పెట్టి అసలే చడువుకోనివాడు. తంబాకుని నిలిపినట్లు ఆమె జీవితాన్ని తన అరిచేతులోకి తీసుకుని నిరంతరం నలుపుతూనే ఉంటాడు...

వేదింపు ఎలా ఉంటుందో ఆ బాధను అనుభవించే ఉద్యోగినే చెపాలి. చెప్తుంది. ఓపిక పట్టి పట్టి చివరికి చెప్తుంది. పై ఆఫీసర్ కి చెప్తుంది. ఆయినకు అర్ధం కాదు. పాయింట్ ఏమిటో అర్ధం కాదు. ఆఫీసులో చాటుగా చేయి పట్టుకోవడం, చీర కొంగు పట్టి లాగడం, అక్కడిక్కడ గిల్లడం యాగాల నుండి వస్తున్న ఆచారమే కదా అన్నట్లు చూస్తాడు. వెళ్లి పని చూసుకోమంటాడు. ఆవిడ వెళ్ళాక, పనుంది ఒకసారి వచ్చి వెళ్ళమంటాడు. వచాక, "మనసు బాగోలేదు, ఏదైనా మాట్లాడవా" అంటూ దీనంగా అర్దిస్తాడు. వెళ్తుంటే వెనకనుండి చూస్తూ, ఎక్కడో ఏదో బాగుందని అంటాడు. ఉద్యోగం మానె వరకు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు....
వేధింపు ఎలా ఉంటుందో ఆ బాధను అనుభవించే గృహిన్నె చెపాలి. కానీ చెప్పదు. భర్తా బైట పడిపోతాడు కాబట్టి. వేధింపు ఎలా ఉంటుందో ఆ బాధను అనుభవించిన బాలికే చెపాలి. కానీ చెప్పలేదు. వేధింపు అంటే ఏమిటో తెలియని వయసు కనుక.
చెప్పుకున్న, చెప్పుకోలేకపోయిన, 'ఎన్కౌంటర్' లు జరుగుతున్న, పోలీస్ స్టేషన్ లో టీవీ కెమెరాలు పీట్టి చెప్పుదెబ్బలు కొట్టిస్తున్న... అమ్మాయిలను, ఉద్యోగినలను, గృహినులను, బాలికలను వేధించేవారు ఎకధ్యనంతో తమ పామి తాము చేసుకుపోతూనే ఉన్నారు!
"తాలిబన్లు ఆడపిల్లలను బడులకు వేల్లనియడం లేదని, మహిల్లలను బయిటికి రానియడం లేదని, ఎదిగిన ఆడపిల్లలన్ను వారు తమ పిల్లలను మిల్లిత్తన్ట్లకు ఇచ్చి పెళ్లి చేయాలనీ ఫత్వాలు జారిచేస్తున్నారని విద్దురంగా చెప్పు కుంట్నం. మన దగ్గర అంతకన్నా భిన్నంగా ఎం ఉందని ??!!!